EKANTHA BALALAYAM FETE AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా బాలాలయ కార్యక్రమాలు
Tirupati, 10 September 2021: The second-day program of the ongoing Balalayam fete at Sri Govindaraja Swamy temple was conducted in Ekantam on Friday.
After seating both Swami and Ammavaru at the temple Kalyana Mandapams daily kaikaryas were performed followed by rituals at the yagashala from morning to evening.
Special grade DyEO Sri Rajendrudu, temple chief archaka Sri P Srinivasa Dikshitulu, Agama adviser Sri Vedantam Vishnu Bhattacharya, AEO Sri Ravikumar Reddy were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా బాలాలయ కార్యక్రమాలు
తిరుపతి, 2021 సెప్టెంబరు 10: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయ కార్యక్రమాలు రెండో రోజైన శుక్రవారం ఏకాంతంగా జరిగాయి.
ఆలయంలోని కల్యాణమండపంలో బాలాలయం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో ఉదయం, సాయంత్రం క్రతువులు ఏకాంతంగా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ పి.శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఎఈవో శ్రీ ఎం.రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ ఎ.నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎ.కామరాజు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.