శ్రీ గోవిందరాజస్వామివారికి రాగి ఆభరణాలు బహూకరణ
శ్రీ గోవిందరాజస్వామివారికి రాగి ఆభరణాలు బహూకరణ
తిరుపతి, 2022 ఫిబ్రవరి 08: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారికి రూ.లక్ష విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభరణాలను మంగళవారం అజ్ఞాత భక్తుడు కానుకగా సమర్పించారు. ఆలయంలో దాత ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడికి వీటిని అందించారు.
ఇందులో ఉత్సవమూర్తులకు అలంకరించే మూడు కిరీటాలు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు సాదారాళ్లు పొదిగిన నాలుగు ముఖ పట్టిలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎపి.శ్రీనివాసదీక్షితులు, సూపరిండెంట్ శ్రీ నారాయణ,టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కామరాజు, ఆలయ అర్చకులు, పరిచారకులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.