ANKURARPANA AT TALLAPAKA  _ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహం వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా కుంభాభిషేకానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ.

TIRUPATI, 31 OCTOBER 2025: The Ankurarpanam for Pratista Kumbhabhisheka Mahotsavam of Sri Venkateswara Swamy temple in Tallapaka was held on Friday evening.

From October 31 to November 03, the Vedic programs in connection with the Kumbhabhishekam will take place.

On November 03, religious events like Maha Purnahuti, Maha Kumbha Samprokshana followed by Srivari Kalyanam in the evening will be observed.

TTD is making elaborate arrangements for the fete.

DyEOs Smt Prasanthi, Ari Siva Prasad, AEO Sri Balaraju, Superintendent Sri Hanumanthaiah and others, devotees, sevaks were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహం వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా కుంభాభిషేకానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ.

తిరుపతి, 2025, అక్టోబర్ 31: అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి (108 అడుగల) విగ్రహం వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవానికి టిటిడి ఆధ్వర్యంలో శుక్రవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. అంకురార్పణంలో భాగంగా విశ్వక్సేన ఆరాధనం, యాగ సంకల్పం, భగవత్పుణ్యాహం, రక్షాబంధనం, వాస్తుహోమం, పర్యగ్నికరణము, పంచగవ్యప్రోక్షణం, మృత్యుంగ్రహణం, ధ్వజ కుంభారాధనములు, అఖండ దీపస్థాపనము, యాగమంటపబలి, మంగళహారతిలను ఆగమోక్తంగా నిర్వహించారు.

ఈ రోజు నుండి నవంబర్ 03వ తేదీ వరకు పలు వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. నవంబర్ 01వ తేదీన మహాకుంభ స్థాపన, జలాధివాసం, నవంబర్ 02వ తేదీన మూర్తి హోమం, స్నపన తిరుమంజనం, శయ్యాధివాసం చేపడుతారు.

నవంబర్ 03వ తేదీన ఉదయం 04 గం.టల నుండి 05 గం.ల లోపు విగ్రహ ప్రతిష్ట, అష్టబంధన సమర్పణం, ఉదయం 09 గం.లకు మహా పూర్ణాహుతి, తదుపరి మహాకుంభాప్రోక్షణ, ప్రాణ ప్రతిష్టాన్యాసములు, ప్రథమ కాలారాధనం జరుగనుంది. సాయంత్రం 06 గం.లకు శ్రీనివాస కల్యాణం వేడుకగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ధ్యానమందిరం (108 అడుగుల విగ్రహం) వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవోలు శ్రీ ఎ.  శివప్రసాద్, శ్రీమతి ఏ. ప్రశాంతి, ఏఈవో శ్రీ బాలరాజు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలాజీ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. 

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.