శ్రీ నారాపుర శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పవిత్ర ప్రతిష్ట

శ్రీ నారాపుర శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పవిత్ర ప్రతిష్ట

తిరుపతి, 2025, సెప్టెంబర్ 02: కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ 02 నుండి 04వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలలో భాగంగా మొదటిరోజు సెప్టెంబర్ 02వ తేదీ మంగళవారం ఉదయం అగ్ని ప్రతిష్ట, పవిత్ర ప్రతిష్ట, బలిహరన, శాత్తుమొర నిర్వహించారు.

సెప్టెంబర్ 03వ తేదీ బుధవారం పవిత్ర హోమాలు, పవిత్ర సమర్పణ తదితర వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

సెప్టెంబర్ 04వ తేదీ గురువారం మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, మహాకుంభప్రోక్షణ, పవిత్ర వితరణ తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం ఉత్సవరులకు ఊరేగింపు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది