VALMIKIPURAM PAVITROTSAVAMS CONCLUDES _ శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
Tirupati, 07 October 2025: The annual Pavitrotsavams in Valmikipuram temple concludes with Maha Purnahuti on Tuesday.
Temple staff, Archakas and devotees were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుపతి, 2025, అక్టోబర్ 07: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయంలో మంగళవారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం భాగవత ఆరాధన, మహా పూర్ణాహుతి, కుంభ ప్రక్షన, పవిత్ర విసర్జన, చక్రస్నానం తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
సాయంత్రం తిరుచ్చి వీధి ఉత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా వెళ్లి భక్తులకు ఆశీర్వదించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబందాల అధికారిచే విడుదల చేయబడినది.
