CHANDRAGIRI MLA PRESENTS PATTU VASTRAM TO TIRUCHANOOR TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Tirupati,24 November 2022: As part of tradition, every year during Karthika Brahmotsavam of Tiruchanoor temple, the Chandragiri MLA and TTD ex-officio board member Dr Chevireddy Bhaskar Reddy presented Pattu vastrams to Goddess Sri Padmavati on behalf of Tummalagunta Sri Venkateshwara Swami temple on Thursday.

Earlier Dr Bhaskar Reddy accompanied by his spouse was given traditional reception at temple Mahadwaram by TTD JEO Sri Veerabrahmam. Later he has Darshan of Ammavaru.

Speaking to media later the MLA said since several years the practice presenting pattu vastram on the occasion of Gaja vahana during Karthika Brahmotsavam is under implementation.

Temple DyEO Sri Lokanatham and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుప‌తి, 2022 న‌వంబ‌రు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం చంద్రగిరి ఎమ్మెల్యే , టీటీడీ బోర్డు సభ్యులు. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆలయానికి చేరుకున్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులకు జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి అనేక సంవత్సరాలుగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవనాడు పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం కలగడం తన పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.