TRADITIONAL SARE _ శ్రీ పద్మావతి అమ్మవారికి పద్మశాలీల వస్త్ర సమర్పణ

TIRUPATI, 12 NOVEMBER 2023: The community of Padmashalis offered Sare to Sri Padmavathi Devi on Sunday.

 

It has been a tradition in vogue for several decades. In a procession along four mada streets, they offered Vastrams, vermilion, turmeric to Ammavaru.

 

AEO Sri Ramesh, archakas were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి పద్మశాలీల వస్త్ర సమర్పణ

తిరుప‌తి, 2023 నవంబర్ 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మశాలీలు అమ్మవారికి చీర, పసుపు కుంకుమ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పద్మశాలీలు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేశారు.

పద్మశాలీలకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.