SARE OFFERED _ శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Tirupati, 14 November 2023: The Legislator of Chandragiri Dr Bhaskar Reddy presented Sare to Sri Padmavathi Ammavari temple in Tiruchanoor on Tuesday.

Temple DyEO Sri Govindarajan received the MLA in a traditional manner and arranged darshan.

Speaking to the media Sri Bhaskar Reddy said, it has been a tradition to offer Sare to Ammavaru during Brahmotsavams on behalf of Tummalagunta Sri Kalyana Venkateswara Swamy Devasthanams.

VGO Sri Bali Reddy, AEO Sri Ramesh, Superintendent Smt Srivani and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుప‌తి, 2023 న‌వంబ‌రు 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆలయానికి చేరుకున్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులకు ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి అనేక సంవత్సరాలుగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవనాడు పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం కలగడం తన పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో విజీవో శ్రీ బాలి రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.