ENDOWMENTS MINISTER PRESENTS VASTRAMS _ శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాలయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ

TIRUPATI, 28 NOVEMBER 2024: The Honorable Minister of AP Endowments Sri Anam Ram Narayana Reddy has presented silk vastrams to Sri Padmavati Ammavaru at Tiruchanoor on Thursday evening.

Usually, it is a tradition to present silk vastrams on behalf of the state government to Tiruchanoor temple during the annual brahmotsavams.

Speaking to the media he thanked the Honourable CM of AP Sri N Chandrababu Naidu for the divine opportunity.

TTD has made elaborate arrangements to the devotees participating in the mega religious festival.

Earlier, TTD EO Sri Syamala Rao, JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Sridhar and other officers welcomed the dignitary in a traditional manner.

After the darshan of Ammavaru, the AP minister was offered Vedaseervachanam and Prasdams.

DyEO Sri Govindarajan, VGO Smt Sada Lakshmi, AVSO Sri Satish Kumar and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాలయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ

తిరుపతి, 2024 నవంబరు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు, జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీమతి గౌతమి, సివి అండ్ ఎస్వో శ్రీధర్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరిలో ఒకరిగా అమ్మవారి దర్శనం చేసుకునే నేను, పట్టు వస్త్రాలు సమర్పించే ఘటనలను టీవీల్లో చూడడం, పత్రికల్లో చదవడమో చూశా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తల్లిదండ్రుల పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయకుడికి రుణపడి ఉన్నానని అన్నారు, గురువారం రోజున తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం చేసుకోవడం, అదే రోజున శ్రీ పద్మావతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. సిఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మెరుగైన మార్పులు తీసువచ్చేలా చర్యలు చేపట్టామని మీడియాతో మాట్లాడారు.
బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల కోసం టీటీడీ అన్ని వ‌స‌తులు క‌ల్పించింద‌న్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, విజివో శ్రీమతి సదాలక్ష్మి, ఏవీఎస్వో వై.సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది