శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి, మే 23, 2013: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా గురువారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 4.00 గంటలకు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం అమ్మవారి ప్రసాదాలను, తితిదే పుస్తకాలను, చిత్రపటాన్ని ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.