శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జీలు

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జీలు

తిరుపతి, 2023 న‌వంబ‌రు 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం రాత్రి సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అరవింద కుమార్, జస్టిస్ విశ్వనాథ్, హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకట రమణ దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న జడ్జిలకు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి వీరికి ప్రసాదాలు అందించారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ‌ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.