KOIL ALWAR HELD AT PAT _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TIRUPATHI, 06 MAY 2025: The Koil Alwar Tirumanjanam was held with religious fervour in Sri Padmavati Ammavari temple at Tiruchanoor on Tuesday.

As the annual Vasanthotsavams are scheduled from May 11 to 13 with Ankurarpanam on May 10, this fete was observed.

Devotees shall pay Rs. 150 per ticket per person to participate in this festival.

On May 12, a procession of Swarna Ratham will be observed at 9:45am. Every day from 2:30pm to 4:30pm the spring festival is observed in Friday Gardens to the Utsava Murty of Sri Padmavati Ammavaru.

TTD has cancelled Arjita Kalyanotsavam, Unjal Seva on these three days owing to the annual Vasanthotsavams.

Archaka Sri Babu Swamy, AEO Sri Devarajulu, Superintendent Sri Ramesh, AVSO Sri Sathish kumar participated.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

మే 11 నుండి 13వ తేదీ వరకు వసంతోత్సవాలు

తిరుప‌తి, 2025 మే 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుద్ధి నిర్వ‌హించారు.

అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.

ఈ ఉత్స‌వాల కార‌ణంగా మే 11 నుండి 13వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ జీ.రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి, సుబ్బరాయుడు, ప్రసాద్, ఏవీఎస్వో శ్రీ జీ.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.