VASANTHOTSAVAM HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం
TIRUPATI, 21 NOVEMBER 2025: On the breezy rainy evening on Friday as a part of the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor, Vasanthotsavam was observed.
The deity was paraded along the four mada streets. The Goddess was rendered a holy bath with Sandal paste and other aromatic substances.
Later the sandal paste was sprinkled on devotees.
Temple officials were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం
తిరుపతి, 2025 నవంబరు 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శుక్రవారం సాయంత్రం వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడ వీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ , ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.








