PAVITROTSVAMS CONCLUDED _ మహాపూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
TIRUPATI, 29 SEPTEMBER 2023: The annual Pavitrotsvams in Tiruchanoor temple concluded on a grand religious note on Saturday.
After Snapanam to the Utsava deity of Sri Padmavathi Ammavaru and Sri Sudarshana Chakrattalwar in the morning, Pavitra Purnahuti was performed in the evening.
JEO Sri Veerabrahmam, Deputy EO Sri Govindarajan and others participated.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మహాపూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2023 సెప్టెంబరు 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన చేపట్టారు.
ఆ తరువాత మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. పద్మపుష్కరిణి అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలోనే గంగాళంలో చక్రస్నానం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈవో శ్రీ రమేష్, అర్చకులు శ్రీ బాబుస్వామి, శ్రీ మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.