PARIMALAM CLEANSES UP TIRUCHANOOR TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 07 NOVEMBER 2023: The entire temple and its sub-shrines were cleansed up with the aromatic Parimalam mixture as a part of Koil Alwar Tirumanjanam on Tuesday in Tiruchanoor.

The traditional temple cleaning event Koil Alwar Tirumanjanam was observed with religious fervour in Tiruchanur temple between 6am and 9am.

Speaking to the media on the occasion, the TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy said this ritual of prelude before annual brahmotsavams signifies the cleaning of the entire temple premises for the big event.

He said all the arrangements are in place for the nine-day Annual Brahmotsavam at Tiruchanur Temple.

Adding further he said, TTD has also given a facelift to the Padma Sarovaram temple tank at Rs.9cr for the upcoming Panchami Theertham event on November 18.

CURTAINS DONATED

Hyderabad devotee Sri Swarna Kumar Reddy has donated 11 curtains while Guntur-based devotees Sri Arun Kumar, Smt Padmavathi along with local devotees Smt Pavitra, Smt Rajani donated four curtains with one each to Sri Padmavathi Ammavari temple at Tiruchanoor.

TTD Trust Board members Sri Yanadaiah, Sri Naga Satyam, Sri Subbaraju, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, VGO Sri Bali Reddy, AEO Sri Ramesh, Agama advisor Sri Srinivasacharyulu, archakas and other staffs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమల తరహాలో  శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలు

– తిరుచానూరులో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి, 2023 నవంబరు 07: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారని టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ 
ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టీటీడీ ఛైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించామన్నారు. నవంబరు 9న అంకురార్పణ, 10న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 14న అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహన సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని, ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా అధికారులు చక్కటి ప్రణాళికల్ని రూపొందించారని తెలిపారు. 18న పంచమితీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చి కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. దాదాపు రూ.9 కోట్లతో పంష్కరిణిని ఆధునీకరించి నీటితో నింపారని తెలియజేశారు.

ఆలయంలో ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

15 పరదాలు విరాళం

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి చేతుల మీదుగా భక్తులు 15 పరదాలను విరాళంగా అందించారు. హైదరాబాదుకు చెందిన శ్రీ స్వర్ణ కుమార్ రెడ్డి 11, గుంటూరుకు చెందిన శ్రీ అరుణ్ కుమార్, శ్రీమతి పద్మావతి, తిరుచానూరుకు చెందిన శ్రీమతి పవిత్ర, శ్రీమతి రజిని ఒక్కొక్కటి చొప్పున నాలుగు పరదాలను విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ యానాదయ్య,  శ్రీ నాగసత్యం, శ్రీ సుబ్బరాజు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, విజివో శ్రీ బాలిరెడ్డి, ఏఈవో శ్రీ రమేష్, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీమతి శ్రీవాణి, శ్రీ శేషగిరి, అర్చకులు శ్రీ బాబుస్వామి, శ్రీ వేంపల్లి శ్రీను స్వామి, శ్రీ మణికంఠ స్వామి, సిఐ శ్రీ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.