DEVOTIONAL PROGRAMS IMPRESS _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక శోభ
TIRUPATI, 02 DECEMBER 2024: The devotional programs organised by TTD for Tiruchanoor Brahmotsavam at various places in Tirupati impressed local devotees.
On Monday the Annamacharya Sankeertans, religious discourse, classical dance, Harikatha won the hearts of denizens at Astana Mandapam in Tiruchanoor, Silparamam, Mahati, Ramachandra Pushkarini and Annamacharya Kalamandiram.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక శోభ
తిరుపతి, 2024 డిసెంబరు 02: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన పండితులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు
ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన డాక్టర్ రాఘవాచార్యులు’ శ్రీ సూక్త వ్యాఖ్యానము’ అనే అంశంపై ఉపన్యసించారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన శ్రీ రంగనాథ్ బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.
అనంతరం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి సావిత్రి జయంతి బృందం హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రఘునాథ్ బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా గానం చేశారు.
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీకి చెందిన పద్మశ్రీ కనకా శ్రీనివాసన్ భరతనాట్యం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి విజయవాడకు చెందిన శ్రీ హర్షిత రాధా రాణి బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6:30 గంటలకు తిరుపతికి చెందిన కుమారి డాక్టర్ జె శ్రీలలిత, హోసూర్ కు చెందిన శ్రీకృష్ణ బృందం భక్తి సంగీతం నిర్వహించారు.
తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి వైష్ణవి బృందం నృత్య రూపకం ప్రదర్శించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.