SPIRITUAL PROGRAMS _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అలరించిన ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు
TIRUPATI, 04 DECEMBER 2024: The spiritual devotional programs brighten up the day on Wednesday.
The different venues in Tirupati organised a variety of devotional programs comprising
Harikatha, Bharatnatyam, Bhakti Sangeetam, Dharmikopanyasam and others.
The denizens thoroughly enjoyed these programs organized by TTD under the aegis of HDPP wing of TTD.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అలరించిన ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు
తిరుపతి, 2024 డిసెంబరు 04: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన పండితులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు
ఉదయం 10 నుండి 11 గంటల వరకు నంద్యాలకు చెందిన శ్రీ హయగ్రీవ ఆచార్యులు ధార్మికోపన్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కృష్ణా జిల్లాకు చెందిన శ్రీ ఫణి కుమార్ బృందం వేణు గానం కార్యక్రమం జరిగింది.
అనంతరం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి సుమలత బృందం హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా గానం చేశారు.
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి లలిత శివజ్యోతి బృందం సంగీత కార్యక్రమం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి తిరుపతికి చెందిన శ్రీమతి చిన్నమ్మ దేవి బృందం భక్తి సంగీతం, శ్రీమతి చైతన్య భరతనాట్యం ప్రదర్శించారు.
శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీమతి భారతి బృందం హరికథ గానం చేశారు.
తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి విజయవాడకు చెందిన శ్రీ కృత్య కళాంజలి శ్రీరామచంద్రమూర్తి బృందం భరతనాట్యం ఆకట్టుకుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.