శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయం, ఉప ఆలయాలకు పూజా సామ‌గ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానం

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయం, ఉప ఆలయాలకు పూజా సామ‌గ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానం

జులై 5, తిరుపతి, 2022: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి, ఇతర ఉపాలయాలకు 2022-23 సంవత్సరానికి గాను అర‌టిపండ్లు, త‌మ‌ల‌పాకులు, టెంకాయ‌లు, నిమ్మ‌కాయ‌లు త‌దిత‌ర పూజా సామ‌గ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానించడమైనది.

జులై 8వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌లోపు టెండరు షెడ్యూల్ పొంద‌వ‌చ్చు. ఆలయ‌ డెప్యూటీ ఈవో కార్యాలయంలో అదేరోజు మధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు టెండ‌ర్లు స్వీక‌రించి, మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లు తెరుస్తారు. ఇతర వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.