VIRTUAL KALYANOTSAVAM AT TIRUCHANOOR TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వర్చువల్ కల్యాణోత్సవం
ONLINE TICKTES FROM MONDAY TO FRIDAY
Tirupati,17 August 2023: TTD has decided to organise virtual Kalyanotsavam daily at Sri Padmavati Ammavaru temple in Tiruchanoor for which online tickets will be issued from Monday to Friday for the benefit of devotees from outstations akin to Tirumala.
The devotees could participate in the virtual Kalyanotsavam by watching the programme live on the SVBC channel. The Grihastha participants with ₹500 ticket (two persons per ticket)would beget the darshan of Goddess Sri Padmavati Devi in 90 days from the date of purchasing the tickets and also receive one Uttariyum, blouse, laddu and vada as well.
TTD appealed to all devotees in far-off places to utilise this opportunity of virtual participation and beget blessings and Prasadam.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వర్చువల్ కల్యాణోత్సవం
– సోమవారం నుండి శుక్రవారం వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ
తిరుపతి, 17 అగస్టు 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవంలో భక్తులు వర్చువల్‌గా పాల్గొనే అవకాశం టీటీడీ కల్పిస్తోంది.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది . రూ.500/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు టికెట్టు పొందిన తేదీ నుండి 90 రోజులలోపు గృహస్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. వీరికి ఒక ఉత్తరియం, రవిక, లడ్డూ, వడ బహుమానంగా అందిస్తారు.
సుదూర ప్రాంతాల నుండి తిరుచానూరు వచ్చి అమ్మవారి కల్యాణోత్సవంలో పాల్గొన లేని భక్తుల కోసం టీటీడీ వర్చువల్ కల్యాణోత్సవం ప్రవేశపెట్టింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.