TTD EO RELEASES SRI PADMAVATI AMMAVARI BRAHMOTSAVAMS BOOKLET _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్ ఆవిష్కరించిన టీటీడీ ఈవో
Tirupati, 04 November 2024: TTD EO Sri J. Syamala Rao on Monday unveiled a booklet of Kartika Brahmotsavams of Sri Padmavati temple, Tiruchanoor to be held from November 28 to December 6 in the EO Chamber’s at TTD Administrative Building in Tirupati.
Speaking on the occasion, the EO said Brahmotsavams will commence with Dwajarohanam (flag hoisting ceremony) on November 28.
Important days includes Gajavahanam on December 2, Bangaru Ratham on December 3, Rathotsavam on December 5 and Panchami Thirtham on December 6.
TTD JEO Sri Veerabraham, Chief PRO Dr T Ravi, DyEOs Sri Govindarajan, Smt Prasanthi were present.
Following are details of Vahana Sevas in the morning and evening respectively
28-11-2024 Dwajarohanam and Chinna Sesha Vahana
29-11-2024 Pedsesha vahanam and Hamsa Vahana
30-11-2024 Mutyapupandiri Vahanam and Simha Vahanam
01-12-2024 Kalpavriksha Vahanam and Hanumanta vahanam
02-12-2024 Pallaki Utsavam, Vasanthotsavam and Gaja vahanam
03-12-2024 Sarva bhupala Vahanam, Swarna Ratham and Garuda Vahanam
04-12-2024 Surya Prabha Vahanam and Chandraprabha Vahanam
05-12-2024 Rathotsavam and Aswa Vahanam
06-12-2024 Panchami Thirtham and Dwajavarohanam
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్ ఆవిష్కరించిన టీటీడీ ఈవో
తిరుపతి, 2024 నవంబరు 04: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుండి డిసెంబరు 6వ తేదీ జరుగనున్న కార్తీక బ్రహ్మోత్సవాల రోజువారి కార్యక్రమాల బుక్ లెట్ ను సోమవారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 28వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయన్నారు. డిసెంబరు 2వ తేదీ గజవాహనం, డిశెంబరు 3న బంగారు రథం, డిశెంబరు 5న రథోత్సవం, డిశెంబరు 6వ పంచమితీర్ధం వుంటుందని తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీమతి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
వాహనసేవల వివరాలు :
తేదీ
28-11-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – చిన్నశేషవాహనం
29-11-2024
ఉదయం – పెద్దశేషవాహనం
రాత్రి – హంసవాహనం
30-11-2024
ఉదయం – ముత్యపుపందిరి వాహనం
రాత్రి – సింహవాహనం
01-12-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – హనుమంతవాహనం
02-12-2024
ఉదయం – పల్లకీ ఉత్సవం – వసంతోత్సవం,
రాత్రి – గజవాహనం
03-12-2024
ఉదయం – సర్వభూపాల వాహనం – సాయంత్రం – స్వర్ణ రథం,
రాత్రి -గరుడవాహనం
04-12-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
05-12-2024
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వ వాహనం
06-12-2024
ఉదయం – పంచమితీర్థం
రాత్రి – ధ్వజావరోహణం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.