MEDICAL EQUIPMENT WORTH Rs. 90 LAKH DONATED TO SPCHC _ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి రూ. 90 లక్షల విలువైన వైద్య పరికరాల విరాళం

Tirupati, 31 January 2026: Advanced medical equipment worth Rs. 90 lakh was donated to the Sri Padmavati Children’s Heart Centre by Smt. Madhurima Singh, Executive Director of the Mumbai-based Alkem Foundation.

The equipment was formally handed over to TTD JEO (Health & Education) Dr. A. Sharath on Saturday.

Details of the donated equipment are as follows:

High-end Ventilators – 4

Patient Monitors – 4

Humidifiers – 4

HFNC (High Flow Nasal Cannula) devices – 4

Speaking on the occasion, JEO(H&E) stated that the donated equipment would be highly beneficial for pediatric cardiac treatments.

He appreciated the Alkem Foundation for coming forward to support the healthcare needs of children, especially by contributing equipment required for the upcoming new Children’s Hospital.

On the occasion, Smt Madhurima Singh was felicitated with a shawl and presented with a portrait of Sri Venkateswara.

Hospital Director Dr. Srinath Reddy, RMO Dr. Bharat, representatives of the Alkem Foundation, doctors, and hospital staff were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి రూ. 90 లక్షల విలువైన వైద్య పరికరాల విరాళం

తిరుపతి, జనవరి 31, 2026: శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ముంబైకు చెందిన అల్కెమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి మధురిమ సింగ్ రూ. 90 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించారు. శనివారం ఉదయం ఈ పరికరాలను టిటిడి జేఈవో (ఆరోగ్యం & విద్య) డా. . శరత్ కు  అందజేశారు.

దాత అందించిన పరికరాలు

1. హై ఎండ్ వెంటిలేటర్లు – 4

2. పేషెంట్ మానిటర్లు – 4

3. హ్యూమిడిఫయర్లు – 4

4. హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ (హై ఫ్లో నాసల్ కేన్యులా పరికరాలు) – 4

ఈ సందర్భంగా జేఈవో డా. . శరత్  మాట్లాడుతూ, చిన్నపిల్లల హృదయ చికిత్సలకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న నూతన చిల్డ్రన్స్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలను విరాళంగా అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అల్కెమ్ ఫౌండేషన్ మరింత అభివృద్ధి సాధించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీమతి మధురిమ సింగ్ ను శాలువాతో సత్కరించి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్, అల్కెమ్ ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది