₹1.51 CRORE DONATED TO HRIDAYALAYA _ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు రూ.1.51 కోట్ల వైద్యపరికరాలు విరాళం
Tirupati, 30 November 2023: The Bengaluru-based Hindusthan Aeronautics Limited has donated ₹1.51 crore to the Sri Padmavati Children’s Heart Care hospital towards the purchase of medical equipment.
An MoU was signed by representatives of the HAL and TTD EO Sri AV Dharma Reddy along with hospital Director Dr Srinath Reddy on Thursday at the TTD Administrative Building in Tirupati.
Speaking on the occasion Sri CB Ananta Krishnan, CMD of HAL said the hospital under TTD is providing excellent service to the poor and saved lot many children with heart ailments.
The HAL contribution is towards necessary operation theatres, anaesthesia workstations, ventilators with monitors as part of the company’s CSR efforts.
TTD JEO for Health and Education Smt Sada Bhargavi, CVSO Sri Narasimha Kishore, HAL HR Director Sri AB Pradhan, Senior Manager Sri Somen Chaudhary, FA&CAO Sri Balaji, Additional CAO Sri Ravi Prasadu were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు రూ.1.51 కోట్ల వైద్యపరికరాలు విరాళం
తిరుపతి, 30 నవంబరు 2023: తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ రూ.1.51 కోట్ల విలువైన వైద్యపరికరాలు కొనుగోలుకు విరాళం అందించారు. ఈ మేరకు గురువారం టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులు, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డితో ఎంఓయు కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ సిఎండి శ్రీ సిబి.అనంతకృష్ణన్ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ అద్భుతమైన సేవలు అందిస్తోందని, ఎంతో మంది పేదలు మెరుగైన గుండె వైద్యసేవలు పొందుతున్నారని కొనియాడారు. ఈ ఆసుపత్రికి అవసరమైన మూడు ఆపరేషన్ థియేటర్ అనస్థీషియా వర్క్ స్టేషన్ వెంటిలేటర్స్ విత్ మానిటర్స్ కొనుగోలుకు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా విరాళం అందించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, సంస్థ హెచ్ఆర్ డైరెక్టర్ శ్రీ ఎబి.ప్రధాన్, సీనియర్ మేనేజర్ శ్రీ సౌమెన్ చౌదరి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, అదనపు ఎఫ్ఏసిఏవో శ్రీ రవిప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.