AP CHIEF SECRETARY INSPECTS CHILDRENS HOSPITAL WORKS _ శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి 

Tirupati, 2, June 2023: AP Chief Secretary Dr KS Jawahar Reddy inspected the ongoing construction works at Sri Padmavati Children’s Hridyalaya and Super speciality Hospital and made valuable suggestions on Friday morning.

 

Speaking on the occasion the state chief secretary said works were on war footing and plans were roll, six types of super speciality services in the hospital by December. TTD has already geared to buy the latest medical equipment, recruit doctors and paramedic staff.

Earlier Dr Jawahar Reddy also visited the general ward, operation theatres at the Hrudayalaya and interacted with patients and parents who had come from many regions for the heart operations. 
 

He lauded the hospital for providing free services and also complimented the doctors and staff for their selfless services and that the how provided services better than corporate standards.

TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, hospital director Dr Srinath Reddy, RMO Dr Bharath were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి

తిరుపతి, 2023 మే 02: శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం, శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన
శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆసుపత్రిలో ఆరు రకాలైన సూపర్ స్పెషాలిటీ సేవలను అందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఇందుకు అవసరమైన డాక్టర్లు , సిబ్బందిని నియమించుకుని , అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.

హృదయాలయంలో జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను చూశారు. పిల్లల గుండె ఆపరేషన్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. డాక్టర్లు, సిబ్బంది నిబద్ధతతో వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఆసుపత్రి కార్పొరేట్ స్థాయి కంటే బాగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్ పాల్గొన్నారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది