శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌ విద్యార్థునులకు ప్రాంతీయ క్రీడా పోటీలలో ఛాంపియన్షిప్ 

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌ విద్యార్థునులకు ప్రాంతీయ క్రీడా పోటీలలో ఛాంపియన్ షిప్ 

తిరుపతి, 2025, డిసెంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ, టిటిడి ఆధ్వ‌ర్యంలో శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గత రెండు రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. 

మంగళవారం జరిగిన క్రీడా పోటీల్లో శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థునులు ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. అన్ని పోటీల సింగిల్స్ లో ఛాంపియన్ గా కుమారి అశ్విని విజేతగా నిలిచారు.

ఇందులో భాగంగా 14 పాలిటెక్నిక్ కళాశాల నుండి  241 మందికి పైగా విద్యార్థినిలు పాల్గొన్నారు.  అథ్లెటిక్స్‌, ఖోఖో, వాలీబాల్‌, టేబుల్ టెన్నిస్‌, బాడ్మింట‌న్ తదితర క్రీడ‌ల పోటీలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డా. పద్మావతమ్మ, ఇతర అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.