శ్రీ పద్మావతీ అమ్మవారికి 8 గొడుగులు బహుకరణ
శ్రీ పద్మావతీ అమ్మవారికి 8 గొడుగులు బహుకరణ
తిరుపతి, 2025, నవంబర్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు గురువారం ఉదయం చెన్నైకి దాత 8 గొడుగులను అందజేశారు.
తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూరుకు చెందిన భాష్య కార్య కైంకర్య ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ వెంపటి మాధవ నాయుడు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయ మండపంలో 8 గొడుగులను ఆలయ అధికారులకు అందజేశారు. ఈ గొడుగులను పద్మావతీ అమ్మవారి వాహన సేవల్లో ఉపయోగించనున్నారు.
ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


