VISAKHA SEER OFFERS PRAYERS IN SRI PAT _ శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి

Tiruchanoor, 8 Nov. 20: The Pontiff of Visakha Sarada Peetham, HH Sri Swaroopanandendra  Saraswati Swami along with Junior Pontiff Sri Swatmanandendra Saraswathi Swami offered prayers in the temple of Goddess Sri Padmavathi Devi at Tiruchanoor on Sunday. 

On his arrival, he was accorded a traditional welcome by the religious staff. TTD Trust Board Chairman Sri YV Subba Reddy, TTD Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar were also present. Later he offered prayers in the temple.

After Darshan speaking to media outside the temple he said, he prayed Goddess to free the entire humanity from the clutches of Corona and bless the state with prosperity. 

Temple DyEO Smt Jhansirani, AEO Sri Subramanyam and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి

తిరుప‌తి, 08, న‌వంబ‌రు 2020: విశాఖలోని శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి, పీఠం ఉత్త‌రాధికారి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామివారు ఆదివారం ఉద‌యం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న స్వామీజీల‌కు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. అనంతరం ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.

అనంత‌రం ఆల‌యం వెలుప‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి మీడియాతో మాట్లాడుతూ క‌రోనా మ‌హమ్మారిని అంత‌మొందించాల‌ని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని అమ్మ‌వారిని ప్రార్థించిన‌ట్టు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.