TIRUCHANOOR TEMPLE TIMINGS EXTENDED _ శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన సమయం గంట పెంపు
Tiruchanoor, 18 Dec. 20: TTD extended the darshan closing time in Sri Padmavathi Devi temple at Tiruchanoor by one more hour.
Earlier, due to covid restrictions, the darshan timings were between 7:30am to 7pm. Now the darshan closing time is extended by one hour, upto 8pm. Ekanta Seva will be performed at 8:30pm.
This decision was taken in the larger interests of devotees, as the pace of Covid has reduced. However, the devotees will be allowed following Covid guidelines.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన సమయం గంట పెంపు
తిరుపతి, 2020 డిసెంబరు 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన సమయాన్ని గంట పాటు పొడిగిస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. రాత్రి 7 గంటల వరకు ఉన్న అమ్మవారి దర్శన సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించారు.
కోవిడ్ నిబంధనలు సడలించిన అనంతరం జూన్ 8వ తేదీ నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం 7.30 నుండి రాత్రి 7 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించేవారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడం, భక్తుల సంఖ్య పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.