TRIDANDI PONTIFF OFFERED PRAYERS AT TIRUCHANOOR TEMPLE _ శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి

Tiruchanoor, 25 February 2021: The Tridandi pontiff Sri Sri Sri Tridandi Srimannarayana Ramanuja Jeeyar Swamy on Thursday evening offered prayers at the Goddess Sri Padmavati Temple, Tiruchanoor.

He was received with traditional temple honours by TTD chairman, AP minister Sri C Venugopal Krishna, TTD EO Dr KS Jawahar Reddy, additional EO Sri AV Dharma Reddy, and temple archakas.

The Tridandi pontiff took a pradakshina of the temple and Dwajasthambham before offering prayers to Goddess Padmavati and also visited the sub-temples of Sri Krishna and Sri Sundararaja Swami within the premises.

Thereafter the TTD Chairman and TTD EO presented thirtha Prasadam and Goddess portrait to the Pontiff.

Later speaking to the media the Pontiff called upon people to give up wayward living and take adequate precautions to save themselves and the society from pandemic Covid.

Contending that the pandemic had raised its hydra head again he urged people to compulsorily wear masks, observe social distancing and use sanitizers extensively.

The pontiff said in the backdrop of attacks on temples in AP he had visited some other temples in Rayalaseema whose sculptural heritage and divinity deserved patronage by TTD.

He said he had submitted a report on such temples to the TTD chairman for consideration of patronage.

TTD Trust board member Sri Jupalli Rameswaram Rao, Sri Shivkumar, Sri Venkata Bhaskar Rao, DyEO Smt Jhansi Rani and AEO Sri Subramaniam and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి

తిరుపతి, 2021 ఫిబ్రవరి 25: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు గురువారం సాయంత్రం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.  

ఆల‌యం వ‌ద్ద శ్రీ స్వామివారికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, రాష్ట్ర మంత్రి శ్రీ చెల్లు‌బోయిన వేణుగోపాల కృష్ణ, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జవ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య అర్చ‌కులు సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. శ్రీ జీయ‌‌ర్‌స్వామి అమ్మ‌వారి ఆల‌య ప్ర‌ద‌క్షిణ అనంత‌రం ధ్వ‌జ‌స్థంభానికి న‌మ‌స్క‌రించి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ‌‌‌‌అనంత‌రం ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ‌స్వామి, శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఛైర్మ‌న్, ఈవో  శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారికి అమ్మ‌వారి తీర్థ ప్ర‌సాదాలు అందించారు.

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ వెంక‌ట భాస్క‌ర్‌రావు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

ప్ర‌జ‌ల్లో విచ్చ‌ల విడిత‌నం పోవాలి – జాగ్ర‌త్త‌లు పాటించాలి

ప్ర‌జ‌ల్లో విచ్చ‌ల ‌విడిత‌నం పోయి, జాగ్ర‌త్త‌లు పాటిస్తూ కోవిడ్ నుండి బ‌య‌ట ప‌డాల‌ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారు పిలుపునిచ్చారు. శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యం వెలుప‌ల స్వామిజీ మీడియాతో మాట్లాడారు.

త‌గ్గి పోయింద‌నుకున్న క‌రోనా వ్యాధి మ‌ళ్ళీ ప్ర‌బ‌లుతోంద‌నే ఆందోళ‌న ప్రారంభ‌‌మైందని, ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ, ప‌రిశుభ్ర‌త‌తో క్ర‌మ‌శిక్ష‌ణ‌గా మ‌స‌లు కోవాల‌న్నారు. ఈ విప‌‌త్క‌ర ప‌రిస్థితి నుండి ప్ర‌జ‌ల‌ను కాపాడాల‌ని అమ్మ‌వారిని ప్రార్థించాన‌న్నారు. ప‌విత్ర‌మైన మాఘ‌మాసంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకోవ‌డం పుణ్య‌దాయ‌క‌మ‌ని చెప్పారు.

ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆల‌యాల మీద స‌మాజ విఘాత శ‌క్తులు దాడులు చేసి విగ్ర‌హాలు ధ్వంసం చేసిన నేప‌థ్యంలో తాను రాయ‌ల‌సీమ‌లోని అనేక ఆల‌యాల‌ను సంద‌ర్శించిన‌ట్లు చెప్పారు. ఈ ఆల‌యాల్లో ఆద్భుత శిల్ప‌సంప‌ద‌, శ‌క్తి వంత‌మైన దేవ‌తా విగ్ర‌హాలు ఉన్నాయ‌న్నారు. ఆల‌యాల‌కు ఆద‌ర‌ణ‌, ఆరాధ‌న క‌ల్పించేందుకు కొన్ని సూచ‌న‌ల‌తో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డికి నివేదిక అందించ‌నున్న‌ట్లు చెప్పారు. ఆల‌యాలు బాగుప‌డితే ప్ర‌జ‌ల్లో విశ్వాసం, రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి స‌మాజం ఆరోగ్య క‌రంగా ఉంటుంద‌న్నారు. ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆరోగ్యంగా ఉండాల‌ని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని కూడా ప్రార్థిస్తానని శ్రీ జీయ‌ర్‌స్వామి చెప్పారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.