Tirumala, March 23, 2026: Representatives of Arihant Dyestuff Private Limited, Ahmedabad, donated ₹11 lakh on Monday to the Sri Balaji Aarogya Vara Prasadini Scheme being run under the auspices of TTD.
As per the wish of the company representatives, the donation is to be utilized for providing medical services to poor patients. The donation was handed over by Sri Y. Raghavendra of Tirupati.
In the chambers of the TTD Executive Officer at the Administrative Building in Tirupati, Sri Y. Raghavendra presented the demand draft of ₹11 lakh to TTD EO Sri M. Ravichandra.
On this occasion, the TTD EO expressed gratitude to the donors and appreciated their spirit of service.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు రూ.11 లక్షలు విరాళం
తిరుమల, 2026 మార్చి 23: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి అహ్మదాబాద్‌కు చెందిన Arihant Dyestuff Private Limited సంస్థ ప్రతినిధులు సోమవారం రూ.11 లక్షల విరాళం అందించారు.
పేద రోగులకు వైద్య సేవలకు ఉపయోగించాలనే సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు తిరుపతికి చెందిన శ్రీ వై. రాఘవేంద్ర ఈ విరాళాన్ని అందజేశారు.
తిరుపతిలోని పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ను కలిసి రూ.11 లక్షల డీడీని ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో దాతలకు ధన్యవాదాలు తెలియజేసి, వారి సేవాభావాన్ని అభినందించారు.
టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

