BEDI ANJANEYA GETS SPECIAL ABHISHEKAM _ శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం

TIRUMALA, 15 DECEMBER 2024: On the last Sunday of Karthika month, special Abhishekam was performed to Sri Bedi Anjaneya Swamy located opposite Tirumala temple.

As a part of it, the Mula Virat of Sri Bedi Anjaneya Swamy was anointed with milk, curd, honey, Sandal Paste, Turmeric.

Temple Peishkar Sri Ramakrishna and other temple staff, archakas, devotees were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం

తిరుమల, 2024 డిసెంబరు 15: తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వెలసివున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.

కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.