SAHSARA KALASHABHISHEKAM FETE AT SRI LN TEMPLE _ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
Tirumala, 1 Jun. 22: As part of Madalabhisekam celebrations TTD organised Sahasra Kalashabisekam fete at the Sri Lakshmi Narasimha Swami temple on first Ghat Road on Wednesday morning.
The fete was a follow-up event at the temple where recently where Asta bandhana Maha Samprokshana was conducted.
Srivari temple Dyeo Sri Ramesh Babu, Temple Chief archaka Sri Venugopal Dikshitulu, Vaikhanasa Agama adviser Sri Mohana Rangacharyulu, Sri Bava Narayanacharyulu, other archakas and officials were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
తిరుమల, 2022 జూన్ 01: తిరుమల మొదటి ఘాట్ రోడ్డు నడకమార్గంలో వెలసివున్నశ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం మండలాభిషేకం సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇటీవల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ చేసిన విషయం విదితమే.
సంప్రోక్షణ చేసి మండలం రోజులు పూర్తయిన సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహనరంగాచార్యులు, శ్రీ బావ నారాయనాచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.