MALAYAPPA VISITS VIKHANASA SANNIDHI _ శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

TIRUMALA, 20 AUGUST 2024: On the succeeding day of Sravana Pournami, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi visited Sri Vikhanasa Maharshi Sannidhi located on North Mada street in Tirumala on Tuesday evening.

Temple officials participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

తిరుమ‌ల‌, 2024 ఆగస్టు 20: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు మంగళవారం ఉత్త‌ర మాడ వీధిలో గ‌ల శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేశారు. శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి జ‌యంతి శ్రావణ పౌర్ణమి నాడు జ‌రిగింది. ఆ మ‌రుస‌టి రోజు స్వామి, అమ్మ‌వార్లు శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో వైఖాన‌స ఆగ‌మం ప్ర‌కారం నిత్య‌కైంక‌ర్యాలు, సేవ‌లు, ఉత్స‌వాలు జ‌రుగుతాయి. ఈ వైఖాన‌స ఆగ‌మ‌శాస్త్రాన్ని శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి ర‌చించారు.

సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఆస్థానం నిర్వ‌హించి నివేద‌న చేప‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.