SRI VISHWAVASU NAMA TTD PANCHAGAM RELEASED _ శ్రీ విశ్వావసు నామ సంవ‌త్స‌ర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

Vontimitta, 09 March 2025: Sri Vishwavasu Nama Samvatsara Ugadi Panchangam published by TTD was released at Sri Kodandarama Swami Temple in Vontimitta of Kadapa district on Sunday by TTD Chairman Sri BR Naidu along with the JEO Sri Veerabrahmam.

Written by TTD Asthana Siddhanti Sri Tangirala Venkata Poornaprasad Siddhanti, this Panchangam is solved by the versatile Vaikhanasa Agama scholar Dr Vedantam Vishnubhattacharyulu in an easy and comprehensible way for the sake of common devotees.  

The Panchangam is priced at Rs.75/- and will be available to the devotees in Tirumala and Tirupati from Monday, March 10 onwards while at all other TTD Information Centres from next weekend onwards.

SEs Sri Venkateswarlu, Sri Manoharam, CPRO Dr. T. Ravi, Deputy EOs Sri. Natesh Babu, Smt. Prashanthi, Sri. Govindarajan, Sri. Selvam, Additional Health Officer Dr. Sunil Kumar, VGO Smt.  Sadalakshmi, TTD Press and Sales Wing Special Officer Sri. Ramaraju, Assistant District Fire Officer Sri Adinarayana Reddy, AVSO Sri. Satish Kumar and others participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ విశ్వావసు నామ సంవ‌త్స‌ర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

ఒంటిమిట్ట/తిరుప‌తి, 2025 మార్చి 09: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం ముందు ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవ‌త్స‌ర పంచాంగాన్ని టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి ఆవిష్క‌రించారు.

ధర్మప్రచారంలో భాగంగా టిటిడి ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ‌వారి ఆస్థాన‌మైన టిటిడి ప్ర‌తి సంవ‌త్స‌రం పంచాంగాన్ని భ‌క్త లోకానికి అందించ‌డం అన‌వాయితీగా వ‌స్తున్న‌దే. అదేప్ర‌కారం ఈ ఏడాది కూడా నూత‌న సంచాంగాన్ని భ‌క్తుల‌కు అందిస్తోంది.

ఇందులో భాగంగా రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించింది. టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకట పూర్ణప్రసాద్‌ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని వైఖాన‌స పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభ‌ట్టా చార్యులు సులభంగా, అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారు. రాజాధి నవనాయకుల ఫలితాలతోపాటు రాశిఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టిటిడిలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు.

రూ.75/- విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో సోమవారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగతా టిటిడి సమాచార కేంద్రాలలో వచ్చే వారం నుండి పంచాంగం అందుబాటులో ఉంటుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటపూర్ణప్రసాద్‌, ప్రెస్, సేల్స్ వింగ్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు, డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, శ్రీ గోవింద రాజన్, శ్రీ సెల్వం, సీపీఆర్వో డా.టి.రవి, ఎస్ ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, మనోహర్, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా.సునీల్ కుమార్, వీజీవో శ్రీమతి సదాలక్ష్మి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీ వి. ఆదినారాయణ రెడ్డి, ఏవీఎస్వో శ్రీ వై.సతీష్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.