శ్రీ వేంకటేశ్వరా ఎఫ్.ఎం. కమ్యూనిటి రేడియోతో ప్రజాసంబంధాలు బలోపేతం
శ్రీ వేంకటేశ్వరా ఎఫ్.ఎం. కమ్యూనిటి రేడియోతో ప్రజాసంబంధాలు బలోపేతం
తిరుమల, సెప్టెంబర్-12 , 2009: ప్రజలలో చైతన్యం కలిగిస్తూ విద్యార్థులలోని ప్రతిభను వెలికితీస్తూ, ప్రజాసంబంధాలను బలోపేతం చేస్తూ సామాజిక ముద్రతో శ్రీవారి కంఠంలో మణిహారంలా వెలుగొందుతొంది శ్రీ వేంకటేశ్వరా ఎఫ్.ఎం. కమ్యూనిటి రేడియో. కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో 2007 ఫిబ్రవరి 8వ తేది శ్రీ వేంకటేశ్వర ఎఫ్.ఎం రేడియో కమ్యూనికేషన్‌ను నెలకొల్పారు. ఇక అప్పటి నుంచి శ్రీవారి భక్తితత్వాన్ని 90.4 మెగా హెడ్స్‌పై ప్రచారం చేస్తూ భక్తుల మన్నలను పొందుతున్నది. ప్రజలకు మరింత చేరువ చేయడానికి తితిదే ఈ ఎఫ్.ఎంను తిరుమల నుంచి తిరుపతికి మార్చి ఎస్.వి. ఓరియంటల్ కళాశాలకు అనుబంధం చేసింది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ప్రచారాలను కొనసాగిస్తున్నది. ఇందులో ముఖ్యంగా నిరక్ష్యరాసుల కోసం, పల్లె ప్రజలకోసం, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వారికి ప్రేరణ కలిగించే ప్రచారాలు ఇందులో వున్నాయి. హిందూ ధర్మ ప్రత్యేకతను, శ్రీవారి మహిమతత్వాన్ని, తిరుమల విశిష్ఠతను ప్రచారం చేస్తూ భక్తుల ప్రశంసలను అందుకొంటున్నది. విద్యార్థులు, మేధావులు, గృహిణిలు, కార్మికులు, కళాకారులు ఇలా ప్రతి ఒక్కరు ఎఫ్.ఎం ప్రచారాలను అభినందిస్తున్నారు.
ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వాహన సేవల విశిష్ఠతను ప్రజలకు ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నది. ప్రజల ఆరోగ్యం, ఆహారం, సంగీతం, పరిసరాల పరిశుభ్రం, వ్యవసాయం, ప్రజాసంబంధాలు, సామాజిక సమస్యలపై ప్రత్యేక ప్రసారాలను ప్రచారం చేస్తున్నది. విద్యార్థులలోని ప్రతిభను వెలికితీస్తూ వారిపాలిట కల్పవృక్షంగా, ప్రజల మధ్య అంతరాన్ని తగిస్తూ సమైఖ్యభావాలను పెంపొందిస్తూన్న శ్రీవేంకటేశ్వరా ఎఫ్.ఎం రేడియో కమ్యూనికేషన్‌ను మరింత విస్తుృత పరచడానికి తితిదే కృషి చేస్తున్నాది.
ఈ బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం నుండి ధ్వజావరోహణం వరకు ప్రతి రోజు వాహన సేవల విశిష్ఠత ప్రముఖ వక్తల వ్యాఖ్యాణం. తిరుమలలోని సుప్రసిద్ధప్రదేశాలు వాటికి వున్న ప్రాముఖ్యతపై ప్రత్యేక ప్రచారాలు. అన్నమయ్య సంకీర్తనలు తదితర కార్యక్రమాలను ప్రసారం చేయనున్నది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.