EO REVIEWS ON SRIVANI TRUST_ శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు (శ్రీవాణి)పై టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సమీక్ష 

Tirupati, 18 Jun. 19: Giving a clarion call to the philanthropists to contribute liberally to SRIVANI Trust of TTD, TTD Executive Officer Sri Anil Kumar Singhal said that this Trust aims at spreading Venkateswara Bhakti by constructing temples at many places.

During his maiden review meeting on the activities and objectives of the newly formed Sri Venkateswara Alaya Nirmanam (SRIVANI) Trust at his chambers in TTD Administrative Building in Tirupati on Tuesday, the EO said, the Trust has been added to the kitty of nine Trusts run by TTD on May 25 this year, now totally taking the figure to Ten trusts. He said so far the donors have contributed Rs.25lakhs towards this trust. “The contributions for this Trust will be utilized in the construction of the temple, management, Archaka Training, PACs and sanitation facilities.

The entire details of donations and donors should be placed on the website for the information of pilgrim public. The Donor Privileges for other Trusts will imply to this Trust also”, the EO maintained.

Tirupati JEO Sri B Lakshmi Kantham, CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji, DyEO Smt Goutami (IAS) and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు (శ్రీవాణి)పై టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సమీక్ష 

జూన్‌ 18, తిరుపతి, 2019:శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు(శ్రీవాణి) ద్వారా ఎక్కువ ప్రాంతాలలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు దాతలు ముందుకురావాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పిలుపునిచ్చారు. తిరుపతిలోని తన కార్యాలయంలో మంగళవారం ఉదయం అధికారులతో ట్రస్టుపై మొదటి సమీక్ష సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది మే 25వ తేదీ నుండి శ్రీవాణి ట్రస్టు కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ.25 లక్షలు దాతలు అందించారన్నారు. ఈ ట్రస్టుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని టిటిడి వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని అధికారులకు సూచించారు. టిటిడిలోని 9 ట్రస్టులు, ఒక స్కీమ్‌కు రూ.లక్ష ఆపైబడి విరాళాలు ఇచ్చే దాతలకు టిటిడి కల్పించే సౌకర్యాలను, శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చే దాతలకు కూడా వర్తింపచేస్తామన్నారు. 

దాతల సహకారంతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల నిర్మాణం, నిర్వహణ, అర్చక శిక్షణ, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆలయాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన వసతి గృహాల నిర్మాణం, పారిశుద్ధ్య పనుల నిర్వహణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 

ఆలయాలలో భక్తులకు అవసరమైన తాగునీరు, నీటిని నిల్వ ఉంచేందుకు ట్యాంకులు, రోడ్లు, లైటింగ్‌, అన్నపస్రాదాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పురాతన ఆలయాలు, గోపురాల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులకు సహకారం అందిస్తామన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.