శ్రీ వేంకటేశ్వర జాతీయ శృవణం సంస్థ ప్రత్యేక శిబిరాలు

శ్రీ వేంకటేశ్వర జాతీయ శృవణం సంస్థ ప్రత్యేక శిబిరాలు

 తిరుపతి, జూన్‌-3,  2009: తిరుమల తిరుపతి దేవస్థానము వినికిడి లోపం యున్న చిన్న పిల్లలను గుర్తించి వారికి తగిన చికిత్స యేర్పాటు చేయడానికి శ్రీ వేంకటేశ్వర జాతీయ శృవణం సంస్థ ద్వారా రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతాలలో జిల్లా యంత్రాంగాల సహాకారంతో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి నేడొక  ప్రకటనలో తెలిపారు. మూడు సంవత్సారాల లోపు వయస్సున్న పిల్లలలో వినికిడి లోపం ఉంటే, వారు చెవిటి తనాన్ని అధిగమించి,  సాధారణ జీవితం గడుపునట్లు చేయడానికి ”శ్రీవేంకటేశ్వర జాతీయ శ్రవణం సంస్థను” తితిదే ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారుల సహకారముతో కడప, కరీంనగర్‌, విజయవాడ, విశాఖపట్నంలలో ప్రాంతీయ శిబిరాలు నిర్వహించి వినికిడి లోపం యున్న చిన్నపిల్లలను గుర్తించి, వారికి తగిన చికిత్స ఇప్పించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని శ్రీ కె.వి. రమణాచారి తెలిపారు. మొట్టమొదటగా, ఈ నెల 9వ తేదీన ఉదయం     10 గంటలకు కడప పట్టణంలో తితిదే కళ్యాణ మండపంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.