శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం

శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, మే 7, 2013: తితిదే ఆధ్వర్యంలో తిరుపతి, వరంగల్‌, భీమవరం ప్రాంతాల్లో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాలల్లో 2013-14వ విద్యాసంవత్సరానికి ప్రథమ తరగతిలో ప్రవేశానికిగాను అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. 5 నుండి 8 సంవత్సరాలలోపు వినికిడి లోపం గల బాలబాలికలు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. మే 31వ తేదీ వరకు పై మూడు కేంద్రాల్లో ఉన్న బధిర పాఠశాలల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల విద్యార్థులు పూర్తి చేసిన దరఖాస్తులను జూన్‌ 5వ తేదీలోపు సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం తిరుపతిలోని బధిర పాఠశాల ప్రిన్సిపాల్‌ను 0877-2264616 ఫోన్‌ నంబరులో సంప్రదించవచ్చు.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.