Inauguration of INTERNATIONAL VEDIC SEMINAR _ శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వేద సదస్సు ప్రారంభం
Tirupati, 03 March 2010:The TTD chairman Sri.D..K. Adikeshavulu said today that three more Veda Pathashalas will be set up in the state by the TTD.
Delivering his presidential address at the inaugural of the International Vedic Seminar the chairman said the TTD has taken up the promotion and preservation of Vedic literature in a big way for the benefit of posterity. ‘We have launched a unique program for the digitalization of Vedic scripts and literature so that the younger generation can get all the benefits of ancient knowledge.
Earlier the Seminar was blessed by His Holiness Jayendra Saraswati of Kanchi Kamakoti peetham who presided as the chief guest. The seminar is conducted on the sprawling campus of Sri Venkateswara Vedic University in the environs of Red sander trees and several Ayurvedic and medicinal plants.
Addressing the audience in which over 1000 Vedic scholars are participating besides students from the Veda Pathashalas and the Sri Venkateswaraswami Vedic t University, His Holiness said Vedas provided solutions for ailments of society and human beings. He said Vedas had solutions for science, Technology and also mundane mathematical, astronomical and economic issues.
Delivering his Keynote address Dr T. N.Dharmadhikari, retired director of Vaidika Samshodhana Mandal, Pune said Vedic literature did not deal with sacrifice and philosophy but also with mathematics, geometry, astronomy, astrology, cosmology, Weaponry, management and concepts of atmosphere.
He urged the future generations to focus on Vedic studies and research as a measure of necessity to fund solutions to all contemporary ailments of the society and the country.
The former chief justice of Karnataka High Court, Justice Y Bhaskar Rao said Vedas were eternal and reflected on the democratic and liberal approach of the Indian society towards all religions and practices.
He said made a fervent appeal for the translation of Vedas into all international languages so that its significance could be better understood by all philosophers of the world and also that Vedas could get their due recognition in the hall of philosophies of the world.
Participating in the event Executive officer of the TTD I Y R Krishna Rao said the TTD will take all possible measures for the promotion of Vedic Literature and the setting up of the Vedic University was one step in that direction.
He said the TTD had taken up not only the digitization of Vedic literature but also its popularization by setting up of Vedic pathashalas to encourage youth in Vedic studies.
Mislav Jezic of the University of Zagreb, Croatia who is participating as a special invitee is presenting a special paper on poetic techniques of Vedic Rishis with special reference to Rig-Veda Samhita. The Sanskrit exponent in the world, Jezic Mislav said Sanskrit is a world language and the Vedic literature in Sanskrit has earned laurels all over the world for its rich heritage of scientific approach.
Dr R Kavita Prasad, secretary of H D P P said the discussions in English, Telugu and Sanskrit will commence at each of the Yajnavalya, Agastha and Max Mueller Vedikas for the next three days in which hundreds of Vedic scholars will participate. The unique Veda parayana’s (chanting of Vedas) by 1008 scholars will also commence at Veda Vyasa Vedika.
The Joint Executive Officer of TTD and Registrar of S V Vedic University, Dr N Yuvaraj, Prof S.Sudarshana Sharma, vice-chancellor of the Sri Venkateswara Vedic University and Dr Vengamma, Director of SVIMS also participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వేద సదస్సు ప్రారంభం
తిరుపతి, 2010 మార్చి 03: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వేద సదస్సులో భాగంగా మొదటి సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనది. చెన్నైకి చెందిన ఆచార్య ఆర్.కృష్ణమూర్తి శాస్త్రి గారు అధ్యక్షత వహించారు. వారు తమ అధ్యక్షభాషణంలో వేదం సర్వవిషయాలకు నిలయమని చెప్పారు. ఋషులనగా శాస్త్రజ్ఞులని, భూతభవిష్యద్వర్తమానములు తెలిసిన వారని చెప్పారు. వేదాలలో విశ్వసహోదరత్వం ప్రతి పాదింపబడినదని, పురుషనూక్తంలో విరాట్టు పురుషుని శరీరం నుండి మానవులే కాక జంతువులు, సకల ప్రాణులు పుట్టినవని చెప్పారు. వేదాలలో ఆధునికులకు ఉపయోగపడే విషయాలు చాలా వున్నాయని అన్నారు.
ఆ తరువాత హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు కేశవనారాయణగారు ”వేదప్రతిపాదితమైన అర్థశాస్త్రం” అనే విషయంపై ప్రసంగించారు. అర్థశాస్త్రం ఉద్దేశ్యం సర్వమానవ సంక్షేమమని దాని మూల సూత్రాలు వేదములో వున్నవని చెప్పారు. ప్రకృతి సంపద అందరికీ సంబంధించినదని, దానిపై అందరికీ సమానాధికారం ఉందన్నారు. త్యాగభావన అవసరమని చెప్పారు. వేదాలలో అనేక ఉదాత్త భావనలున్నాయని, వాటిని మనం పాటిస్తే సమాజ కల్యాణం కలుగుతుందన్నారు. వేదాలలో సమభావన చెప్పబడిందని, వేదాలలో చెప్పిన మార్గదర్శక సూత్రాలే అర్ధశాస్త్రమునకు మూలాధారమని చెప్పారు.
ఆ తరువాత తిరుపతి వేదవిశ్వవిద్యాలయంలో శుక్ల యజుర్వేద అధ్యాపకులుగా పనిచేయుచున్న శ్రీ గోవింద ప్రసాద్ గారు ”వేదములు అపేరుషేయములు-నిత్యములు” అనే అంశంపై ప్రసంగించారు. వేదమనగా జ్ఞానమని, అది అనంతమని చెప్పారు. వేదం చతుర్విధ పురుషార్థములను, ధర్మార్థ కామ మోక్షములను పొందే ఉపాయమును తెలుపుతుందని చెప్పారు. వేదం ఇహ,పరలోకాలకు సంబంధించిన ఫలాలను ఇస్తుందని చెప్పారు. వేదాలను ఎవరూ వ్రాయలేదని, అవి భగవంతుని నుండి వచ్చినవని, శాశ్వతమైనవని, వాటికి నాశనం లేదని చెప్పారు. వేదం జ్ఞానరాశి అన్నారు.
చివరగా వేద విశ్వవిద్యాలయ ఉపకులపతులు శ్రీ సన్నిధానం సుదర్శనశర్మ గారు అధ్యకక్షులను, వక్తలను సన్మానించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.