SPEAKERS HAIL VETURI AS CRUSADER OF ANNAMAIAH SANKERRTAN LITERATURE _ శ్రీ అన్నమయ్య సంకీర్తన సాహిత్యోద్ధారకుడు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి :ఎస్వీ విశ్వ‌విద్యాల‌యం ప్రాచ్య ప‌రిశోధ‌నా సంస్థ డైరెక్ట‌ర్‌ ఆచార్య వేంక‌టేశ్వ‌ర్లు

ACHARYA VENKATESWARLU- DIRECTOR OF ORIENTAL RESEARCH INSTITUTE, SV UNIVERSITY

137th BIRTH ANNIVERSARY OF TTD LEGEND HELD

Tirupati, February 07, 2025:  Acharya Venkateswarlu, Director of the Oriental Research Institute of SV University, hailed TTD legend Sri Veturi Prabhakara Sastri as a great crusader of the Sankirtana literature of Sri Tallapaka Annamayya, glorifying Tirumala Sri Venkateswara Swamy and presented it to the future generations.

The 137th birth anniversary of Sri Veturi Prabhakara Sastri was celebrated on Friday in a grand manner under the auspices of Sri Venkateswara Oriental College. With a literary conference on the theme of Sri Veturi’s contributions in bringing out Annamacharya sankeertans.

Speaking on the occasion, Acharya Venkateswarlu said that Sri Prabhakara Sastri worked to resolve the Sankirtans written by Annamayya on Tirumala Srivari and spread the glory of Sri Venkateswara Swamy worldwide. 

Among others, Eminent literary figure Dr Rajasekhar and TTD Annamacharya Project Director Sri Rajagopala Rao paid profound tributes to the contributions of Sri Veturi and suggested that students should take advantage of such conferences and turn them into research topics.

TTD Annamacharya Project Directors Sri Rajagopala Rao, Sri Gouripeddi Shankara Bhagavatpadu and others garlanded the statue of Sri Prabhakara Shastri located opposite  Sweta Bhavan this morning and paid homage. The scholars also paid floral tributes to the statue of Sri Venturi

The program was presided over by the college principal, Dr. Seetharama Rao. Faculty and students participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ అన్నమయ్య సంకీర్తన సాహిత్యోద్ధారకుడు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి :

ఎస్వీ విశ్వ‌విద్యాల‌యం ప్రాచ్య ప‌రిశోధ‌నా సంస్థ డైరెక్ట‌ర్‌ ఆచార్య వేంక‌టేశ్వ‌ర్లు

తిరుపతి, 2025 ఫిబ్ర‌వ‌రి 07: తిరుమ‌ల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని కీర్తిస్తూ శ్రీతాళ్లపాక అన్నమయ్య రచించిన సంకీర్తనా సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి భారతజాతికి అందించిన మహనీయుడు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అని ఎస్వీ విశ్వ‌విద్యాల‌యం ప్రాచ్య ప‌రిశోధ‌నా సంస్థ డైరెక్ట‌ర్‌ ఆచార్య వేంక‌టేశ్వ‌ర్లు కొనియాడారు. శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 137వ జయంతిని శుక్ర‌వారం ఘనంగా నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఆచార్య వేంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ, తిరుమ‌ల శ్రీ‌వారిపై అన్న‌మ‌య్య ర‌చించిన సంకీర్త‌న‌ల‌ను పరిష్కరించి , శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి శ్రీ ప్రభాకరశాస్త్రి కృషి చేశార‌ని చెప్పారు. తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్కను, తొలి తెలుగు పదం నాగబు అని పరిశోధించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయ‌న ప్రాచీన సాహిత్యంతోపాటు క‌థ‌లు, క‌థానిక‌లు కూడా ర‌చించార‌ని వివ‌రించారు.

ప్ర‌ముఖ సాహితీవేత్త డా.రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ, ఉన్నతమైన సాహితీ విలువలను, యోగ మార్గాన్ని ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయన ప్రతి క్షణాన్ని గ్రంథోద్థరణ కోసమే వెచ్చించారని పేర్కొన్నారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చినట్టు వివరించారు.

టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ రాజగోపాలరావు మాట్లాడుతూ, తెలుగు భాష, సాహిత్య రంగాల్లో విస్తృతంగా పరిశోధన చేసి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి టీటీడీకి గర్వకారణమని చెప్పారు. తన రచనలతో సమాజాన్ని ఎంతగానో చైతన్యపరిచారని తెలిపారు. ఎన్నో పురాతన గ్రంథాలను పరిష్కరించి టిటిడికి అందజేశారని వివరించారు. విద్యార్థులు ఇలాంటి సదస్సులను సద్వినియోగం చేసుకుని పరిశోధనాంశాలుగా మార్చుకోవాలని సూచించారు.

శ్రీ వేటూరి విగ్రహానికి ఘనంగా అతిథులు పుష్పాంజలి సమర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ ప్రభాకరశాస్త్రి విగ్రహానికి టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ రాజ‌గోపాల రావు, శ్రీ గౌరిపెద్ది శంకర భగవత్పాదులు త‌దిత‌రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమం క‌ళాశాల ప్రిన్సిపాల్ డా॥ సీతారామారావు అధ్యక్షతన జరిగింది. అధ్యాప‌కులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.