శ్రీ వరాహస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
శ్రీ వరాహస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
తిరుమల, 2021 నవంబరు 25: తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. నవంబరు 29వ తేదీ సోమవారం ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో అష్టబంధన మహాసంప్రోక్షణ జరుగనుంది.
మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 7 నుండి 10 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు కళాకర్షణ, ప్రబంధ పారాయణం, వేదపారాయణం చేపడతారు.
నవంబరు 26, 27వ తేదీల్లో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా, నవంబరు 27వ తేదీన శ్రీ వరాహస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.