SADHU SUBRAMANYA SHASTRY PAID FLORAL TRIBUTES _ శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రికి ఘనంగా పుష్పాంజలి
Tirupati, 17 December 2024: On the occasion of the 136th birth anniversary of Sri Sadhu Subramanya Shastry, who was a renowned epigraphist and served as first temple Peishkar in TTD, was paid floral tributes by All Projects Program Officer Sri Rajagopal in Tirupati on Tuesday.
The Pushpanjali took place near SVETA building where the life size statue of Sri Sastry is located.
On this occasion, Sri. Shastry’s grandson, District Judge Sri. Murthy said that Sri Shastry has the honor of bringing to light many historical, cultural and legendary inscriptions related to Tirumala temple.
The daughter of Sri Shastry, Smt Sadhu Girija said that Shastry examined and researched many inscriptions out of devotion and made them available to everyone by publishing books.
Scholar Sri Krishna Reddy, other officials were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రికి ఘనంగా పుష్పాంజలి
తిరుపతి, 2024 డిసెంబరు 17: టిటిడిలో పేష్కారుగా, ఎపిగ్రాఫిస్టుగా విశేష సేవలందించిన శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 136వ జయంతి సందర్భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల వారి విగ్రహానికి మంగళవారం డిపిపి ప్రాజెక్టు అధికారి శ్రీ రాజగోపాల్ పుష్పాంజలి సమర్పించారు.
ఈ సందర్బంగా శ్రీ శాస్త్రిగారి మనవడు, జిల్లా జడ్జి శ్రీ మూర్తి మాట్లాడుతూ, తిరుమలకు సంబంధించి అనేక చారిత్రిక, సాంస్కృతిక, ఇతిహాసిక శాసనాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత శ్రీ శాస్త్రి గారికి దక్కుతుందన్నారు. వారి జీవనం అందరికీ ఆదర్శనీయమని చెప్పారు.
శాస్త్రిగారి కుమార్తె శ్రీమతి సాధు గిరిజ మాట్లాడుతూ, శాస్త్రిగారు శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై భక్తితో అనేక శాసనాలను పరిశీలించి, పరిశోధించి అందరికీ అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. శాస్త్రిగారి సహోద్యోగి శ్రీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.