SNAPANA TIRUMANJANAM AT SRI KRT _ శ్రీ సీత ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రాముల ఉత్స‌వ‌మూర్తుల‌కు వేడుక‌గా స్నపనతిరుమంజనం

Tirupati, 04 April 2022: As part of the ongoing annual Brahmotsavam, TTD organized Snapana Tirumanjanam fete for utsava idols of Sri Sitarama Lakshmana Sameta Sri Rama on Monday in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Monday.

The holy fete was a feast to devotees as colourful garlands, cut flowers, Tulasi etc were profusely used to the accompaniment of Veda parayanam by TTD Vedic pundits.

Thereafter the utsava idols were rendered Vasantotsavam and Asthana in the evening.

Special Grade Dyeo Smt Parvati, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh, Temple Inspectors Sri Muniratnam, Sri Jayakumar, Archakas and devotees were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ సీత ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రాముల ఉత్స‌వ‌మూర్తుల‌కు వేడుక‌గా స్నపనతిరుమంజనం

 తిరుపతి, 2022 ఏప్రిల్ 04: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం శ్రీ సీత ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రాముని ఉత్స‌వ‌మూర్తుల‌కు వేడుక‌గా స్నపనతిరుమంజనం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వేద‌పండితులు వేద‌పారాయ‌ణం చేస్తుండ‌గా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రంగురంగుల రోజామాల‌లు, ఇత‌ర పుష్ప‌మాలలు, తుల‌సిమాల‌ల‌ను స్వామివార్లు, అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు.

ఆ త‌రువాత బ్ర‌హ్మోత్స‌వాల్లో అల‌సిపోయిన శ్రీ సీత ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రాముల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు సాయంత్రం వ‌సంతోత్స‌వం, ఆస్థానం నిర్వ‌హించారు.  

ఈ కార్య‌క్ర‌మాల్లో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.