TRAINING FOR DEGREE COLLEGE TEACHERS AT SVETA _ శ్వేతలో టీటీడీ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు శిక్షణ

Tirupati, 25 September 2023: A one-day training program was held at SVETA on Monday morning to teachers of all TTD degree colleges. 

Speaking on the occasion Sri M Nagraj, the national trainer said all the TTD educational institutions will soon get autonomous status and also  NAAC recognition and hence all proceedings had to be in place with an understanding of weaknesses, strengths, opportunities and restraints.

As chief guest, the TTD educational officer Dr Bhaskar Reddy said all faculty members should utilize the training program to enhance the reputation of the institutions. 

SVETA Director Smt Prashanti, education advisor Sri Mohan Kumar Reddy, college principals Smt Mahadevamma, Smt Narayanamma and Sri Venugopal Reddy were present. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్వేతలో టీటీడీ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు శిక్షణ

తిరుపతి, 2023 సెప్టెంబరు 25: తిరుపతిలోని శ్వేత శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో టీటీడీ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు సోమవారం ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయస్థాయి శిక్షకులు శ్రీ ఎం.నాగరాజు మాట్లాడుతూ త్వరలో టీటీడీ కళాశాలలు కొన్ని అటానమస్ గా మారబోతున్నాయని, ఇందుకోసం అనుసరించాల్సిన విధానాలను తెలుసుకోవాలని చెప్పారు. అదేవిధంగా న్యాక్ గుర్తింపు కోసం మన బలాలు, బలహీనతలు, అవకాశాలు, ప్రతిబంధకాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ విద్యాశాఖాధికారి డా. ఎం.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని, కళాశాలలను మరింత ఉన్నతికి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ శ్రీమతి ఎ.ప్రశాంతి, విద్యాశాఖ సలహాదారు శ్రీ మోహన్ కుమార్ రెడ్డి, కళాశాలల ప్రిన్సిపాల్స్ శ్రీమతి మహదేవమ్మ, శ్రీమతి నారాయణమ్మ, శ్రీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.