సంభావన స్కీముకు ఆగమ పండితుల నుండి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

సంభావన స్కీముకు ఆగమ పండితుల నుండి  ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం
 
తిరుపతి, 2010 జనవరి 05: సనాతనమైన వేద పరిరక్షణ, వేద ఉద్దరణకు, వేద విద్యాభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానములు అన్ని విధాల కృషి చేస్తున్నది.

అదే కోవలో ఆంధ్రప్రదేశ్‌లోని వృద్దులైన ఆగమ పండితులకు సంభావన స్కీము ద్వారా నెలకు 3,200/- రూపాయలు ఇచ్చుటకు తితిదే నిశ్చయించినది. వృద్ధాప్య సంభావన కోరే ఆగమ పండితుల నుండి దరఖాస్తులు కోరడమైనది.

అయితే ఆగమ పండితులు 70 సంవత్సరములు పైబడి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారై వుండవలెను. అదేవిధంగా ప్రభుత్వ, తితిదే పెన్షన్‌ పొందువారు దీనికి అనర్హలు సంభావన పొందువారు ఇంటిలో దేవతార్చన చేసుకొంటూ విద్యార్థులకు పాఠం చెప్పవలెను. దరఖాస్తు చేసుకోదలచినవారు ఈనెల 31వ తేది లోపు శ్రీవేంకటేశ్వర ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ, ఎస్‌.వి.సెంట్రల్‌ లైబ్రరీ, శ్వేత భవనము, తిరుపతి అను చిరునామాకు ధరఖాస్తు చేసుకోవలసిందిగా కోరుచున్నాము.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.