REVIEW MEETING ON VONTIMITTA SRI KODANDARAMA SWAMY BRAHMOTSAVAM _ సకాలంలో ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలి – టిటిడి జేఈవో
Tirupati, 22 February 2025: A review meeting on the annual Brahmotsavam of Sri Kodandarama Swamy temple at Vontimitta was held by JEO Sri Veerabrahmam on Saturday at the Conference Hall in the TTD Administrative Building in Tirupati.
As a part of it, the JEO instructed all the concerned heads that the arrangements should be completed on time,
As the annual fete is scheduled to be held from April 06 to 15 this year he asked them to take prior permission and complete the arrangements for the state festival of Sri Sita Rama Kalyanam to be held on April 11.
A large number of devotees are likely to come to the celestial wedding and the arrangements for Annaprasadam, drinking water and buttermilk to be planned meticulously so that the devotees do not face any difficulties, he observed.
He also said the electrical illumination and flower decorations should be more impressive.
The JEO said that the TTD EO Sri J Syamala Rao will hold a coordination meeting with Kadapa district officials soon on Vontimitta Brahmotsavam arrangements.
TTD sleuths and Kadapa district police have to coordinate security for the big event at Kalyana Vedika on the day of Kalyanam. He asked to take measures such as entry, exit routes, queue lines, parking, traffic etc. to avoid any problems in terms of security.
Besides Engineering, the arrangements to be made by Fire, Medical, Health, Hindu Dharma Prachara Parishad, Transport, IT, Srivari Temple, Srivari Sevaks and other departments have also been reviewed in detail.
As only 45 days are left, the JEO asked all the HoDs to prepare a checklist in advance and complete the arrangements accordingly by the end of March.
CE Sri Satyanarayana, SE (Electrical) Sri. Venkateswarlu, Vontimitta Special Officer Smt. Prashanthi and other officials participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సకాలంలో ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలి – టిటిడి జేఈవో
తిరుపతి, 2025, ఫిబ్రవరి 22: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం సూచించారు. ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లపై తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు.
శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 06 – 15వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో రాజీలేకుండా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి ముందస్తుగా అనుమతులు తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. శ్రీసీతారాముల కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ ఏర్పాట్లు చేయాలన్నారు. మరింతగా ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టాలన్నారు. త్వరలో కడప జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కల్యాణ వేదిక వద్ద టిటిడి విజిలెన్స్ అధికారులు, జిల్లా పోలీసులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రతా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, క్యూలైన్లు, పార్కింగ్, ట్రాఫిక్ తదితర చర్యలు చేపట్టాలని కోరారు. బ్రహ్మోత్సవాల వాహన సేవల ముందు, కల్యాణ వేదిక వద్ద, ఆలయ సమీపంలో భజన బృందాలచే ఆకట్టుకునేలా సాంస్క్రతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు నడిచే మార్గాలలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇంజనీరింగ్, అన్నప్రసాదాలు, అగ్నిమాపక శాఖ, వైద్య, ఆరోగ్యం, భద్రతా, ఎలక్ట్రికల్, ఫ్లవర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్, రవాణా, ఐటీ, శ్రీవారి ఆలయం, తదితర శాఖల అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. కేవలం 45 రోజుల గడువే ఉన్న నేపథ్యంలో ముందస్తుగా చెక్ లిస్ట్ పెట్టుకుని, అందుకు అనుగుణంగా మార్చి నెల చివరి నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు.
బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు
06.04.2025 – వృషభ లగ్నంలో ఉ. 9.30 – 10.15 గం.ల మధ్య ధ్వజారోహణం, సా.7 గం.లకు శేష వాహనం
07-04-2025 వేణుగాన అలంకారం హంస వాహనం
08-04-2025 వటపత్రసాయి అలంకారం సింహ వాహనం
09-04-2025 నవనీతకృష్ణ అలంకారం హనుమంత వాహనం
10-04-2025 మోహినీ అలంకారం గరుడసేవ
11-04-2025 శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8.30 గం||లకు), గజవాహనం.
12.-04-2025 రథోత్సవం
13-04-2025 కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం
14-04-2025 చక్రస్నానం ధ్వజావరోహణం(రా|| 7 గం||)
15-04-2025 ——– పుష్పయాగం(సా|| 6 గం||).
ఈ సమావేశంలో సీఈ శ్రీ సత్యనారాయణ, ఎస్.ఈ ( ఎలక్ట్రికల్ ) శ్రీ వేంకటేశ్వర్లు, ఒంటిమిట్ట ప్రత్యేక అధికారి శ్రీమతి ప్రశాంతి, డిప్యూటీవో శ్రీ గోవింద రాజన్, అన్నప్రసాద ప్రత్యేక అధికారి శ్రీ జి ఎల్ ఎన్ శాస్త్రి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.