సనాతన ధర్మంపై అవగాహన పెంచుకోవాలి: స్వామి బోధమయానంద

సనాతన ధర్మంపై అవగాహన పెంచుకోవాలి: స్వామి బోధమయానంద

తిరుపతి, 2023 ఆగస్టు 09: ఆయుర్వేద వైద్య విద్యార్థులు సనాతన ధర్మంపై అవగాహన పెంచుకుని ధర్మబద్ధంగా నడుచుకోవాలని హైదరాబాదు లోని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలియజేశారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బుధవారం సాయంత్రం సనాతన ధర్మంలో విజయ సూత్రాలు అనే అంశంపై స్వామీజీ ఉపన్యసించారు.

సనాతన ధర్మంలో చెప్పిన విధంగా బ్రహ్మచర్యం, ఇంద్రియనిగ్రహం, మితాహారం‌, బాహ్య, అంతర శుద్ధి ద్వారా మనసుశుద్ధి చెంది జ్ఞాపకశక్తి పెంపొందుతుందన్నారు. తద్వారా సమాజంలో వైద్యులుగా చక్కగా కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ హరినాథాచారి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.