సనాతన వైదిక సిద్దాంతలకు అనుగుణంగా జీవనం సాగించాలి – శ్రీ కె.ఎచ్.రాజేష్
సనాతన వైదిక సిద్దాంతలకు అనుగుణంగా జీవనం సాగించాలి – శ్రీ కె.ఎచ్.రాజేష్
తిరుపతి, 2010 మార్చి 04: తిరుమల తిరుపతి దేవస్థానముల సౌజన్యంతో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ నిర్వహణలో అంతర్జాతీయ వేద సమ్మేళనం 2010 మార్చి 3 నుండి 5 వరకు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అధ్యకక్షులుగా శ్రీ ఎస్.వి.రామానుచౌ చార్యులు గారు వ్యవహరించారు. రెండవ రోజు నాటి మధ్యాహ్నం పంచమపత్రంలో అగస్త్యవేదికలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. భగవంతుని ఉపనించడానికి వేదము మార్గాన్ని మనకు కల్గింపజేస్తుంది.
ఇందులో భాగంగా మొదటిగా శ్రీ కె.ఎచ్.రాజేష్, తిరుపతి వాస్త్యలు వేదములు ఆధునిక జీవన ధర్మాలు గురించి ఉపన్యసించారు. వేదాలు అపౌరుషేయాలు ధర్మార్థకామ మోక్షాలను స్వతంత్రంగా తెలియచేయడానికి వేదాలు ఉపకరిస్తాయి. విధి వాక్యములచే విధింపబడినది ధర్మమని దిషేధి వాక్యములచే నిషేధింపబడినది ధర్మమని నిషేధవాక్యములచే నిషేధింపబడినది. అధర్మమని ప్రతిపాదింపబడిందన్నారు. విధ విహితాలు ధర్మాలని అంగీకరించాలన్నారు. మీ మాంసాదర్శనంలో వేద బోదితమై శ్రియ సాధనమైన ది ధర్మంగా గుర్తించారు. స్థాన సంధ్యాదులు నిత్యాలు నైమిత్తేకాలు యాగాలు యజ్ఞాలు మొదలైనవి మానసిక ధార్మిక వాచిక అని ఈ ధర్మాలు 3 విధాలుగా ఉన్నాయి. త్రికరణశుద్ధిగా ఆచరించడానికి వేథాస్త్ర విశ్వాసముతో చేసి మంచి ఫలితాలుంటాయని తెలిపారు. మన ధర్మానికి కొన్ని కారణాల వల్ల విఘాతం ఏర్పడుతున్నది.
సనాతన వైదిక సిద్దాంతలనుగుణంగా వైదిక సిద్దాంతలను గుణంగా వైదిక జీవనం సాగితే వైదిక ధర్మోం నిత్య నూతనంగా నిలిచివుంటుంది. తిలకధారణను లౌకిక దృష్టితో అది అలంగార ప్రాయం ఆధ్యాత్మిక దృష్టితో ధారణ చేయడం వుంది. దేశకాల లింగ వివక్ష లేకుండా శుృస్మృతి పురాణాలు తెలియచేసిన ధర్మాలను ప్రజలు విస్మరిస్తున్నారు. తైత్తిరీయ సంహితలో సత్యం వద ధర్మం చర అని ధర్మాన్ని ఆచరించాల్సిన విషయాన్ని ఉపదేశిస్తుంది. తపస్సు శౌచము దయ సత్యము ఇవి కూడా ధర్మాలుగా శ్రీమద్భాగవతంలో పేర్కొనబడినది. దేశకాలముల దృష్ట్యా ధర్మాన్ని స్వార్థానికి కాకుండా లోక రక్షాణార్థం అందరూ అనుష్టించాలి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.