CE INSPECTED SSD COUNTERS _ సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను పరిశీలించిన టిటిడి అధికారులు
TIRUPATI, 19 APRIL 2022: The Chief Engineer of TTD Sri Nageswara Rao along with SE 2 Sri Jagadeeshwar Reddy inspected the SSD tokens issuing counters in Tirupati on Tuesday evening.
As TTD is contemplating to issue SSD tokens soon, the CE verified the amenities to be enhanced near the SSD tokens issuing counters.
Part of his inspection, he initially visited the counter near Bhudevi Complex, Srinivasam Complex and Govindaraja Swamy Choultries.
Chief of IT Sri Sesha Reddy, VGO Sri Manohar were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను పరిశీలించిన టిటిడి అధికారులు
ఏప్రిల్ 19, తిరుపతి, 2022 : తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ జారీ కౌంటర్లను మంగళవారం సాయంత్రం టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని అధికారుల బృందం పరిశీలించింది.
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు విధానం పునరుద్ధరించాలని చేయాలని టిటిడి యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా కౌంటర్ల వద్ద భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగ్గా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అన్నప్రసాదాలు అందించేందుకు, భక్తులు మరుగుదొడ్లకు వెళ్లేందుకు వీలుగా క్యూలైన్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు.
ముందుగా అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ వద్దగల కౌంటర్లను పరిశీలించారు. ఆ తరువాత శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, గోవిందరాజస్వామి సత్రాల వద్దగల కౌంటర్లను అధికారులు పరిశీలించారు.
సిఈ వెంట ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విజిఓ శ్రీ మనోహర్ ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.