SARVABHOOPALA VAHANAM HELD _ సర్వభూపాల వాహనంపై అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు
TIRUPATI, 10 JUNE 2025: As a part of the ongoing annual Brahmotsavams in Appalayagunta, Sarvabhoopala Vahanam is held on Tuesday evening.
Earlier in the evening, arjita Kalyanotsavam was held.
Deputy EO Sri Hareendranath, AEO Sri Devarajulu, Superintendent Smt Srivani and others were present.
సర్వభూపాల వాహనంపై అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు
తిరుపతి, 2025, జూన్ 10: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులను అనుగ్రహించారు.
రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 – 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 04.00 – 4.30 గం.ల మధ్య కళ్యాణ మండపానికి శ్రీవారు వేంచేపు చేశారు. సాయంత్రం 4.30 – 6.30 గం.ల మధ్య శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహించారు.
శుక్రవారం ఉదయం 8 గం.లకు పల్లకీలో మోహినీ అవతారంలో స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
జూన్ 11న గరుడ సేవ
శుక్రవారం రాత్రి 7.30 గం.లకు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు.
వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.