PADMAVATHI DEVI ATOP SARVABHUPALA _ సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

TIRUPATI, 15 NOVEMBER 2023: Sri Padmavathi Devi graced the devotees with benevolence atop the finely decked Sarvabhupala Vahanam on Wednesday on the sixth day morning of the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor.

 

The Goddess appeared as Utti Krishna, in the pose of mischievous Lord Sri Krishna breaking the mud pots for butter which clinched the attention of the devotees. 

 

The unique feature of Tiruchanoor annual fest is that in Tirumala Brahmotsavams, Sri Malayappa appears on various vahanams viz.Pedda Sesha, Mutyapu Pandiri, Sarvabhupala, Kalpavriksha besides both the Rathams along with His two Consorts,

but Sri Padmavathi Devi being Sarva Swatantra Veera Lakshmi, always makes Her rich, royal, solo presence on all the carriers during the annual fete showcasing and indicating empowerment.

 

Both the senior and junior pontiffs of Tirumala, TTD Chairman Sri Karunakara Reddy, JEO Sri Veerabrahmam, Dye Sri Govindarajan, VGO Sri Bali Reddy and others were present. 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

తిరుపతి, 2023 నవంబరు 15: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.

శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.

మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

సాయంత్రం 4.20 నుండి 5.20 గంటల వరకు అమ్మవారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించునున్నారు.

వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, విఎస్వో శ్రీ బాలి రెడ్డి, ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.